దసరా బరిలో 3 భారీ సినిమాలు..ఈ సారైన హిట్ కొడతారా?

3 big movies in Dussehra ring..will it be an easy hit?

0
98

దసరాకు అగ్రహీరోలు ఎవరూ బరిలో లేరు. కరోనా ప్రభావం తగ్గినా, ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేందుకు సుముఖంగా లేరు. అందుకే ఈ పండగకు స్టార్ హీరోల మెరుపులు కరవయ్యాయి. కుర్ర హీరోలు మాత్రం వసూళ్ల వేటలో సై అంటూ రంగంలోకి దూకుతున్నారు. దీంతో సినిమా హాళ్లలో యువహీరోల మధ్య పండగ పోటీ ఉండబోతుంది. ఈ నేపథ్యంలో ఈ వారం మన ముందుకు వచ్చే చిత్రాలేంటో చూద్దాం.

లోతు కొలవలేనంత ప్రేమ ‘మహా సముద్రం’లో ఉందంటున్నారు హీరోలు సిద్ధార్థ్‌, శర్వానంద్‌ వాళ్లిద్దరూ స్నేహితులుగా నటిస్తున్న చిత్రమిది. అదితీ రావ్‌ హైదరీ, అను ఇమ్మాన్యుయేల్‌ హీరోహీరోయిన్లు. ‘ఆర్‌ఎక్స్‌100’ ఫేమ్‌ అజయ్‌ భూపతి తెరకెక్కించాడు. దసరా కానుకగా అక్టోబరు 14న థియేటర్‌లో విడుదల కానుంది.

హీరోగా మూడు సినిమాలు చేసినప్పటికీ అఖిల్‌కు సరైన హిట్‌ పడలేదు. ఈ సారి మాత్రం కచ్చితంగా బ్లాక్‌ బస్టర్‌ కొడతాననే ధీమాతో ఉన్నాడీ అక్కినేని హీరో. అఖిల్‌, పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్​లర్‌’. అక్టోబరు 15న దసరా పండగ కానుకగా విడుదలవుతోంది. ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకుడు. గోపి సుందర్‌ అందించిన బాణీలు యువతను అమితంగా ఆకట్టుకున్నాయి.

సీనియర్‌ నటుడు శ్రీకాంత్‌కు ‘పెళ్లిసందడి’ మైలురాయిలాంటి సినిమా. ఇప్పుడు అదే టైటిల్‌తో ఆయన తనయుడు రోషన్‌ హీరోగా ‘పెళ్లిసందD’ సినిమా చేశారు. గౌరి రోనంకి దర్శకత్వం వహించారు. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో తెరకెక్కింది. ఇది కూడా దసరా కానుకగా అక్టోబరు 15నథియేటర్‌లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాతోనే దర్శకేంద్రుడు నటుడిగా మారి, ఓ కీలక పాత్రలో నటించారు.