40 ఏళ్లు వచ్చినా ఇంకా వివాహం చేసుకోని మన హీరోయిన్లు ఎవరో తెలుసా ?

40 ఏళ్లు వచ్చినా ఇంకా వివాహం చేసుకోని మన హీరోయిన్లు ఎవరో తెలుసా ?

0
123

గతంలో వివాహం అంటే 20 లోపు జరిగేది, కాని ఇప్పుడు పెళ్లి అంటే అమ్మాయిలు కూడా కాస్త గ్యాప్ తీసుకుని 35 ఏళ్లు దాటినా వివాహాలు చేసుకోవడం లేదు, అయితే మన హీరోయిన్లు కూడా చాలా మంది ఇంకా వివాహం చేసుకోని వారు ఉన్నారు, ఇంకా సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నారు, సినిమాల్లో వివాహాలు అవుతున్నాయి కాని నిజ జీవితంలో వారు ఇంకా మూడు ముళ్లు వేయించుకోలేదు.

అయితే దాని వెనుక కారణాలు అనేకం ఉండవచ్చు.ముఖ్యంగా హీరోయిన్స్ ఇండస్ట్రీలో రాణించే చాలా మంది పెళ్లికి దూరంగా ఉంటున్నారు. కొంతమంది హీరోయిన్లు మాత్రం 40 ఏళ్ల వయసు దాటినా పెళ్లికి ఎస్ చెప్పడం లేదు. మరి వారు ఎవరో చూద్దాం.

నగ్మా – తెలుగుతో పాటు తమిళ్ లో కూడా ఆమె హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది..45 ఏళ్లు వచ్చినా ఆమె వివాహం చేసుకోలేదు.

టబు
ఇక టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ టబు చాలా సినిమాలు చేశారు, ఆమె కూడా 48 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోలేదు.

సితార : హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రస్తుతం కొనసాగుతుంది సితార. ఈమెకు 47ఏళ్ళ వయసొచ్చినా వివాహం చేసకోలేదు.

సుస్మితా సేన్ ఆమె తెలియని వారు ఉండరు. విశ్వ సుందరి సుస్మితా సేన్ వయసు కూడా 44 ఏళ్లు. ఈమె కూడా పెళ్లి చేసుకోలేదు.

కౌసల్య. ఈ నటి ఇప్పుడు మదర్ పాత్రలు చేస్తున్నారు, ఆమె కూడా ఇంకా వివాహం చేసుకోలేదు.