స్టార్ సింగర్ పై కేసు నమోదు..కారణం ఇదే?

0
131

ఇటీవలే ప్రముఖ బాలీవుడ్ సింగర్ మ్యూజిక్ కంపోజర్ రాహుల్ జైన్ తనపై ఆత్యాచారం చేశాడని.. బలవంతంగా అబార్షన్ చేయించాడని ఓ మహిళ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయమై రాహుల్ జైన్ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ముంబైలో రాహుల్ జైన్ పై ఆత్యాచారం కేసు నమోదైంది.

రాహుల్ జైన్ ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడినట్టు మహిళా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే..ఒకసారి మహిళా బాంబేలోని రాహుల్ జైన్ అపార్ట్మెంట్‏కు వెళ్ళినప్పుడు ఈ ఘాతకానికి పాల్పడినట్టు సదరు మహిళ ఆరోపించింది. ఈ ఘటనపై స్పందించిన రాహుల్ జైన్ మహిళ చెప్పిన ఆరోపణలన్ని అవాస్తవమంటూ చెప్పుకొచ్చారు.