ఆ సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ద్విపాత్రాభినయమా ?

ఆ సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ద్విపాత్రాభినయమా ?

0
98

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆయనకు టాలీవుడ్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు… ఇటు మెగాఫ్యాన్స్ అందరూ ఆయనని ఎంతో ఇష్టపడతారు… ఇటు రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల మూడున్నర సంవత్సరాలు ఆయన సినిమాలు చేయలేదు.. ప్రస్తుతం అనేక సినిమాలు చేస్తున్నారు.. ఇక వకీల్ సాబ్ సినిమా ఇటీవల విడుదలై టాలీవుడ్ లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

 

అయితే తాజాగా ఆయన క్రిష్ తో ఓ సినిమా చేస్తున్నారు హరిహర వీరమల్లు ఈ చిత్రం… ఇక తాజాగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న పీఎస్ పీకే 28 గురించి తెలిసిందే…. ఇక ఇప్పటికే హరీష్ ఓ మంచి స్టోరీ సిద్దం చేశారట

హరిష్ శంకర్, పవన్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ గా నమోదైన విషయం తెలిసిందే. ఇక ఈసారి పవన్ తో ఆయన ఎలాంటి సినిమా చేస్తారా అని అభిమానుల ఎదురుచూస్తున్నారు.

 

టాలీవుడ్ లో ఓ వార్త వినిపిస్తోంది ఈ సినిమా గురించి.. పవన్ కళ్యాణ్ ఇందులో డబుల్ రోల్ చేయనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి… ఈ స్టోరీ కూడా పవన్ కు నచ్చిందని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని టాలీవుడ్ టాక్ .