ఆ దర్శకుడి సినిమాకి నో చెప్పిన సాయిపల్లవి రీజన్ ఏమిటంటే ?

ఆ దర్శకుడి సినిమాకి నో చెప్పిన సాయిపల్లవి రీజన్ ఏమిటంటే ?

0
110
Sai Pallavi

సాయిపల్లవి టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన పాత్రలు చేస్తున్న నటి, అంతేకాదు కథ పాత్ర నచ్చితేనే ఆమె సినిమా చేస్తుంది.. లేకపోతే ఆ సినిమాని ఒకే చేయదు, అందుకే ఆమెకి యూత్ లో కూడా మంచి క్రేజ్ ఉంది, అయితే ఆమె చేతిలో ఇప్పుడు పలు ప్రాజెక్టులు ఉన్నాయి..

తాజాగా సాయిపల్లవి ఓ ప్రముఖ దర్శకుడు ప్రముఖ నిర్మాత చెప్పిన స్టోరీకి ఒకే చెప్పలేదు అని వార్తలు వినిపిస్తున్నాయి..దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాన్ని ప్లాన్ చేశారు, ఈ సినిమాకి సాయి పల్లవి అయితే బెటర్ అని ఆమెతో చర్చించారు కాని ఆమె ఒకే చేయలేదు.

పాత్ర నచ్చకపోవడంతో ఆమె వెంటనే నో చెప్పేసిందని తెలుస్తోంది. ఇప్పుడు టాలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్ గా ప్రచారంలో వుంది. మరి ఎవరిని ఈ రోల్ కోసం తీసుకుంటారో అనే చర్చజరుగుతోంది, అయితే ఇప్పుడు ఆమె లవ్ స్టోరీ అనే సినిమా చేస్తోంది, తర్వాత ఆమె విరాటపర్వం శ్యామ్ సింగ రాయ్ సినిమాలు కూడా ఒకే చేసిన విషయం తెలిసిందే.