ఆద‌ర్శ‌కుడ్ని టార్గెట్ చేసిన పూన‌మ్ కౌర్

ఆద‌ర్శ‌కుడ్ని టార్గెట్ చేసిన పూన‌మ్ కౌర్

0
92

ఏ ప‌రిశ్ర‌మ లో అయినా పాజిటీవ్ అయినా నెగిటీవ్ అయినా దేని గురించి అయినా సోష‌ల్ మీడియాలో తెలియ‌చేస్తున్నారు, అభిమానుల‌కి కూడా సెల‌బ్రెటీలు సులువుగా దీని ద్వారా త‌మ అప్ డేట్స్ చెబుతున్నారు, అయితే తాజాగా సినిమా హీరోయిన్ పూన‌మ్ కౌర్ పెట్టిన పోస్టు ఇప్పుడు పెను వైర‌ల్ అవుతోంది అంతేకాదు చ‌ర్చ జ‌రుగుతోంది.

మానసిక ఒత్తిడి వల్ల నా ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు మొదలయ్యాయి. ఈ సమస్యల నుంచి ఎలా బయటపడాలో చెప్పమని ఓ దర్శకుడిని అడిగా నువ్వు చనిపోతే ఒక్క రోజు న్యూస్‌ అవుతావ్ అంటూ ఎగతాళిగా మాట్లాడాడు అత‌ను అన్నా మాట‌లు న‌న్ను చాలా బాధ‌పెట్టాయి అని న‌టి పూన‌మ్ కౌర్ తెలిపింది.

సినిమా నటీనటుల జాబితా నుంచి నా పేరును తొలగించాడు. నా గురించి అస‌త్య ప్ర‌చారాలు చేశాడు, స్టేజీల మీద గొప్ప మాట‌లు చెప్పే ఈ డైరెక్ట‌ర్ సావిత్రి గారి గురించి అంత పొగిడే ఈ ద‌ర్శ‌కుడు లోక‌ల్ టాలెంట్ ఎప్పుడూ ప్రొత్స‌హించ‌డు అని ఆమె కామెంట్ చేసింది.

నువ్వు గురూజీవి కాదు స్వలాభం కోసం స్నేహితుల్ని మభ్యపెడుతూ లాభాల్ని పొందుతున్నావు.వారు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నావు.అంటూ పూనమ్‌కౌర్‌ వరుస ట్వీట్స్ చేసింది