ఆ దర్శకుడిని ప్రభాస్ కూడా వదిలేశాడా

ఆ దర్శకుడిని ప్రభాస్ కూడా వదిలేశాడా

0
97

అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ పెద్దగా మళ్లీ టాలీవుడ్ లో కనిపించడం లేదు.. ఆయన పేరు వినిపించడం లేదు, ఈ సినిమా తర్వాత తెలుగులో మరే సినిమా ఆయన చేయలేదు, అయితే ఆయన ఇటీవల ప్రభాస్ కు ఓ సినిమా రాస్తున్నారు అని ఆ కథ వినిపించి ఒకే చేయించుకుంటారు అని గత నెలలో వార్తలు వచ్చాయి.

అందరూ ఇదినిజమే అని అనుకున్నారు, కాని అది కుదరలేదు తాజాగా ప్రభాస్ నాగ్ అశ్విన్ తో సినిమా ఒకే చేసుకున్నారు, వీరి చిత్రం పై అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది.సందీప్ ప్రభాస్ తో ఓ భారీ చిత్రం ప్లాన్ చేశారు.

యూవీ క్రియేషన్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఆ సినిమాను నిర్మించాల్సి ఉంది.
తెలుగు హిందీ కన్నడ తమిళ్ లో ఈ చిత్రం రిలీజ్ చేయాలి అని అనుకున్నారు.. కాని అది వర్క్ అవుట్ కాలేదు. గతంలో మహేష్ తో సినిమా అన్నారు అదీ అవ్వలేదు.. ఇప్పుడు ప్రభాస్ తో కూడా సినిమా వర్క్ అవుట్ కాలేదు, ఇక లాభం లేదు అని ఫుల్ కమర్షియల్ స్టోరీలు ప్లాన్ చేస్తున్నారట ఈ డైరెక్టర్ .