ఆ దర్శకుడితో మరోసారి చరణ్ సినిమా – టాలీవుడ్ టాక్

ఆ దర్శకుడితో మరోసారి చరణ్ సినిమా - టాలీవుడ్ టాక్

0
84

దర్శకుడు సుకుమార్ కు టాలీవుడ్ లో ఎంతో మంచి పేరు ఉంది….విభిన్న స్టోరీలను తెరకెక్కిస్తారు అనే గుర్తింపు ఉంది…

సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ నటనకు అందరూ ఫిదా అయ్యారు, సూపర్ సినిమాగా ఇది టాలీవుడ్ లో నిలిచింది.

 

 

అంతేకాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినీ కెరీర్లో ఓ అపురూప చిత్రం రంగస్థలం. గ్రామీణ యువకుడి పాత్రలో ఆయన నటకు ఎన్నో ప్రశంసలు వచ్చాయి.. రామ్ చరణ్కు జోడిగా సమంత నటించగా.. ఇతర కీలకపాత్రలో ఆది, అనసూయ నటించారు.

 

అయితే ప్రస్తుతం ఆచార్య అలాగే ఆర్ ఆర్ ఆర్ సినిమాలు చేస్తున్నారు చరణ్.. అంతేకాదు ఆయన తర్వాత ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో సినిమా కూడా అనౌన్స్ చేశారు, అయితే టాలీవుడ్ లో మరో వార్త వినిపిస్తోంది, ఈ సినిమాలు పూర్తి అయ్యాక రామ్ చరణ్, సుకుమార్ మరో సినిమా చేయనున్నారట, దీనిపై టాలీవుడ్ లో వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఇది నిజం అవ్వాలి అని అభిమానుల కోరుకుంటున్నారు.