ఆ దర్శకుడితో నెక్ట్స్ అల్లు అర్జున్ సినిమా ? టాలీవుడ్ టాక్ ?

ఆ దర్శకుడితో నెక్ట్స్ అల్లు అర్జున్ సినిమా ? టాలీవుడ్ టాక్ ?

0
78

టాలీవుడ్ దర్శకుల్లో రాజమౌళి కొరటాల శివ అపజయం లేకుండా దూసుకుపోతున్నారు , ప్రతీ సినిమా వారు చేసింది సూపర్ హిట్ అవుతున్నాయి….ఇలాంటి కోవలోకి వస్తున్నారు మరో దర్శకుడు అనిల్ రావిపూడి. ఆయన తన కెరియర్ ని నెమ్మదిగా చిన్న సినిమాలతో స్టార్ట్ చేసి సూపర్ స్టార్లతో సినిమా చేస్తున్నారు, కష్టపడి పైకి వచ్చిన దర్శకుల్లో ఒకరిగా ఆయన కూడా నిలుస్తున్నారు.

 

టాలీవుడ్ లో శ్రీనువైట్ల తర్వాత అంత కామెడీని తన కధల్లో యాక్షన్ మాస్ అన్నీ చూపించే దర్శకుడిగా ఆయనకు పేరు వచ్చింది..ఎఫ్ 3 సినిమా చేస్తున్నారు ప్రస్తుతం అనిల్ రావిపూడి, ఇక ఈ సినిమా తర్వాత ఆయన ఏ హీరోతో సినిమా చేస్తారు అని చర్చ అయితే జరుగుతోంది. అయితే తాజాగా అల్లు అర్జున్ పేరు తెరపైకి వచ్చింది.

 

 

ఇక టాలీవుడ్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఇటీవల బన్నీకి అనిల్ ఓ స్టోరీ వినిపించారట, ఈ లైన్ నచ్చడంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని వార్తలు వినిపిస్తున్నాయి.. మరింత ఈ స్టోరీ డవలప్ చేయనున్నారట, ఇక పుష్ప చేస్తున్న బన్నీ తర్వాత ఈ ప్రాజెక్ట్ చేస్తారు అని టాలీవుడ్ టాక్ ..అయితే దీనిపై ఇంకా ఎలాంటి ప్రకటన అయితే రాలేదు.