రేపే థియేటర్లో పుష్ప సందడి..చిరంజీవి స్పెషల్​ విషెస్​

A floral noise in the theater tomorrow..a little tweet saying good luck

0
117
Pushpa 2

ఎట్టకేలకు పుప్ప సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరికొద్ది గంటల్లో (డిసెంబర్ 17న) థియేటర్లలో పుష్పరాజ్ సందడి చేయనున్నారు. బన్నీ కెరీర్‏లోనే అత్యంత భారీ బడ్జెట్‏తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న పుష్ప సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

ఇక రేపు ప్రేక్షకుల ముందుకు పుష్ప సినిమా రాబోతున్న తరుణంలో సినీ ప్రముఖులు బన్నీ అండ్ టీంకు అభినందనలు తెలియజేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ఖాతా ద్వారా పుష్ప టీంకు శుభాకాంక్షలు తెలియజేశారు. అల్లు అర్జున్, రష్మిక మందన్నా, డైరెక్టర్ సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ అండ్ టీంకు అభినందనలు. మీ రక్తం, స్వేదం, గుండె, ఆత్మలను పెట్టి పుష్ప సినిమా చేశారు. మీ ప్రయత్నాలన్నీ విజయవంతం కావాలని మనస్పుర్తిగా కోరుకుంటున్నాను.. గుడ్ లక్ ” అంటూ ట్వీట్ చేశారు చిరంజీవి.

ఇప్పటికే పుష్ప నుంచి విడుదలైన ట్రైలర్, సాంగ్స్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. మరోవైపు పుష్ప ప్రమోషన్స్ కార్యక్రమాలలో బన్నీతోపాటు.. చిత్రయూనిట్ ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్.. పుష్ప మూవీ టీం ముంబైలో ప్రెస్ మీట్ లో ఉన్నారు.