చిత్రపరిశ్రమలో దర్శకుడిగా నిలదొక్కుకోవాలి అని చాలా మంది వస్తారు. టాలెంట్ ఉన్నా కొందరు సరైన హిట్ పడక పైకి రాలేరు. మరికొందరు వచ్చిన అవకాశాలతో చిత్ర సీమలో నిలదొక్కుకుంటారు, అయితే ఈ సమయంలో దర్శకులకి కూడా ఒక్కోసారి చేదు సంఘటనలు అనుభవాలు ఉంటాయి. అలాంటి ఇబ్బందులు తాను పడిన బాధలు, అవమానాల గురించి దర్శకుడు ప్రశాంత్ వర్మ తెలిపారు.
కొత్త దర్శకులకు అవమానాలు ఎదురవుతూ ఉంటాయి. తాను కూడా అందుకు మినహాయింపు కాదని యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ చెప్పాడు. నేను ఓ రోజు ఓ హీరోకి కథ చెప్పడానికి వెళ్లాను. ఈ సమయంలో ఆయనకు ఫస్ట్ కాల్ చేశా, ఆయన రమ్మన్నారు అప్పుడు వెళ్లాను. ఇంటికి వెళ్లగానే ఆయన లోపల ఉన్నారు ఫోన్ చేస్తే కాసేపు వెయిట్ చేయమని చెప్పారు.
నేను గేటు బయటే ఉన్నా ఈ సమయంలో పెద్ద వర్షం వచ్చింది. నేను అక్కడ ఉన్నాను అని తెలిసినా ఆయన నన్ను ఆ వర్షంలో అలాగే వెయిట్ చేయించాడు. నేను ఆ వర్షంలో తడిసిపోతూ, ఆయన ఇంటివైపే చూస్తూ నిలబడ్డాను. కాని కిటికీలోనుంచి ఆయన నన్ను చూస్తు ఉన్నారు. అది నేను గమనించాను. ఇప్పటికీ అది నా కళ్ల ముందు కనిపిస్తుంది అని తెలిపారు ప్రశాంత్ వర్మ. ఇంతకీ ఆ హీరో ఎవరా అని నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు సోషల్ మీడియాలో.