ఆ హిట్ ద‌ర్శ‌కుడితో అఖిల్ సినిమా ?

ఆ హిట్ ద‌ర్శ‌కుడితో అఖిల్ సినిమా ?

0
85

టాలీవుడ్ లో అక్కినేని నాగార్జున నట వారసుడిగా అడుగుపెట్టిన అఖిల్ భారీ హిట్ మాత్రం సాధించ‌లేదు,మూడు సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర యావ‌రేజ్ అనిపించాయి, అయితే ఇప్పుడు తాజాగా అఖిల్ క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నారు..బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చేస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది ఈ చిత్రంలో.

ఇక ఈ సినిమా త‌ర్వాత దర్శకుడు అనిల్ రావిపూడితో అఖిల్ సినిమా చేయ‌నున్నారు అని వార్త‌లు వినిపిస్తున్నాయి, అనిల్ రావిపూడి స‌క్సెస్ బాట‌లో ఉన్నారు, అఖిల్ కు ఓ మంచి క‌ధ వినిపించార‌ట‌.
పూర్తి స్ధాయి కామెడీ ఫిల్మ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు అని తెలుస్తోంది.

అంతేకాదు ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నట్టు వార్త‌లు వ‌స్తున్నాయి,సురేందర్ రెడ్డితో కూడా ఓ మూవీ చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడట అఖిల్. దీనిపై ఇంకా అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.