10వ తరగతిలో బాయ్ ఫ్రెండ్ ని రూమ్ లో దాచిపెట్టి దొరికిపోయిన ప్రియాంక

0
103

ప్రియాంకచోప్రా దేశ వ్యాప్తంగా ఆమెకి కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. బాలీవుడ్ లో ఆమెకి ఎంతో పాపులారిటీ ఉంది. గ్లోబల్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. తనకంటే వయసులో 10ఏళ్ళు చిన్న వాడైన అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్ ను వివాహమాడింది ప్రియాంక . తన భర్తతో కలిసి హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తోంది ఈ అందాల తార‌.

ఇటు బాలీవుడ్ లోనే కాదు హాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తోంది . ప్రియాంక చోప్రా ఆత్మకథ అన్ ఫినిష్డ్ అనే పేరుతో ఓ బుక్ ని రిలీజ్ చేసింది. ఈ పుస్తకంలో తన జీవితంలో జరిగిన అనేక విషయాలు రహ‌స్యాలు తెలిపింది.

చిన్నతనంలో తాను చేసిన ఓ చిలిపి పనిని అన్ ఫినిష్డ్ బుక్ లో రాసుకొచ్చింది ప్రియాంక. ఆమె పదోతరగతి చదువుతున్న సమయంలో తన బాయ్ ఫ్రెండ్ తో దొరికిపోయిందట.
ఒకసారి తన బాయ్ ఫ్రెండ్ ఎవరూ లేని సమయంలో ఇంటికి వచ్చాడు. ఈ సమయంలో ఆంటీ రావడంతో తన గదిలో అత‌న్ని దాచిపెట్టిందట. ఆ సమయంలో ఇంటికి వచ్చిన ఆంటీ ఈ విష‌యం కనిపెట్టి తన తల్లికి ఫిర్యాదు చేశారట. ప్రియాంక పదో తరగతిలో బాబ్ అనే అబ్బాయిని ప్రేమించింది. అతను బాగా నవ్వించేవాడు ఫన్నీగా ఉండేవాడు అని చెప్పుకొచ్చింది. అతడిని పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నా అని చెప్పుకొచ్చింది.