ఆ లేడీ డైరెక్టర్ కథకి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా ?

ఆ లేడీ డైరెక్టర్ కథకి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా ?

0
92

బాహుబలి స్టార్ ప్రభాస్ తాజాగా నాలుగు సినిమాలు ఒకే చేశారు.. దాదాపు రెండు సంవత్సరాల వరకూ ఫుల్ బిజీ అనే చెప్పాలి. అన్నీ పాన్ ఇండియా చిత్రాలే, ఇటు తెలుగుతో పాటు అటు బాలీవుడ్ దర్శకులు నిర్మాతలు కూడా ప్రభాస్ డేట్స్ కోసం చూస్తున్నారు… ఇంకా పలు కథలు వింటున్నారు ప్రభాస్, అయితే కొత్త చిత్రాలతో బిజీగా ఉన్న ఆయన

కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

 

తాజాగా ప్రభాస్ ఓ లేడీ డైరెక్టర్తో సినిమా చేస్తారని టాలీవుడ్ కోలీవుడ్ టాక్ నడుస్తోంది..రాధేశ్యామ్ షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధమవుతుండగా, సలార్, ఆదిపురుష్ సినిమాలు సెట్స్పై ఉన్నాయి. ఈ చిత్రాలు పూర్తి అయిన తర్వాత దర్శకుడు నాగ్ అశ్విన్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాల్సి ఉంది.

 

అయితే ఈ సినిమాల తర్వాత గురు – ఆకాశం నీ హద్దురా చిత్రాల డైరెక్టర్ సుధా కొంగర రీసెంట్గా ప్రభాస్కు ఓ కథ వినిపించారట, అయితే ఈ స్టోరీ నచ్చడంతో ప్రభాస్ చేయడానికి చూస్తున్నారు అనే వార్తలు మీడియాలో వినిపిస్తున్నాయి. చూడాలి ఈ సినిమా చేయాలి అంటే మరో ఏడాది ఆగాల్సిందే అని చిత్ర సీమ వర్గాలు అంటున్నాయి.