సరిలేరు నీకెవ్వరు చిత్రంతో మహేష్ బాబు మంచి హిట్ అందుకున్నారు.. ఈ సంక్రాంతికి ఇక ఈ సినిమా తర్వాత ఆయన చాలా గ్యాప్ తీసుకున్నారు.. ఇక వంశీతో సినిమా అనుకున్నారు కాని అది పట్టాలెక్కలేదు, తాజాగా ఆయన దర్శకుడు పరశురామ్ తో సినిమా చేస్తున్నారు, ఇప్పటికే గీతాగోవిందం సక్సెస్ తో ఉన్న పరశురామ్ ప్రిన్స్ కి కధ చెప్పి సినిమా ఒకే చేయించారట.
ఈ సినిమాకి సంబంధించి మహేశ్ పూర్తిగా పరశురామ్ కే చాయిస్ ఇస్తున్నాడని సమాచారం. ఇందులో ముఖ్యంగా సినిమా సంగీతం విషయంలో మహేశ్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గీత గోవిందం సినిమా పాటలు ఎంత హిట్ అయ్యాయో తెలిసిందే ..సినిమాకి పాటలు కూడా ప్లస్ అయ్యాయి.
అందుకే గీత గోవిందంకు మ్యూజిక్ ఇచ్చిన గోపీ సుందర్ నే ఈ సినిమాకి తీసుకోవాలని పరశురాం మహేష్ భావిస్తున్నారట. గోపీ సుందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోరింగ్ కూడా సినిమాకు ప్లస్ అయి ఆడియన్స్ ను సినిమాకు కనెక్ట్ చేసింది. అందుకే ఇప్పుడు మహేష్ కూడా ఆయనకే సినిమా బాణీలు ఇద్దాం అని అన్నాడని ఫిలిమ్ నగర్ టాక్ నడుస్తోంది, ఇక ఈ చిత్రం మైత్రీ మూవీస్ నిర్మిస్తోందట.