టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ మంచి జోరుమీదున్నాడు. వరుసగా ప్రాజెక్టులు ఒకే చేస్తున్నారు.. పలు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి ..మరికొన్ని చర్చలు జరుగుతున్నాయి, అయితే భీష్మ తో మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే.. నితిన్ ఇప్పుడు అంధాదున్ రీమేక్ లో చేస్తున్నారు.
ఈ సినిమా తర్వాత ఆయన పాటల రచయిత చైతన్య కృష్ణ దర్శకత్వంలో పవర్ పేట సినిమాలో నటిస్తారని వార్తలు వినిపించాయి.. అయితే తాజాగా మరో దర్శకుడితో సినిమాకు సిద్దం అయ్యారు అని టాక్ టాలీవుడ్ లో నడుస్తోంది.
అవును అంధుదాన్ చిత్రం తర్వాత వెంటనే ఆయన వక్కంతం వంశీ తో సినిమా చేస్తారు అని టాలీవుడ్ టాక్, ఇటీవల రచయితగా ఎంతో పేరు సంపాదించుకున్న ఆయన పలు కథలు రాస్తున్నారు, ఇక దర్శకుడిగా కూడా మారారు ..అల్లు అర్జున్ తో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా తీశారు, అయితే తాజాగా నితిన్ కు ఓ కథ వినిపించారని ..అది నచ్చిందని ఆయనతో సినిమా చేసే అవకాశం ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి.