ఆ రికార్డులు దాటితేనే ఆదిని దాటినట్లు- కొత్త టార్గెట్ పెట్టిన హైపర్ ఆది

ఆ రికార్డులు దాటితేనే ఆదిని దాటినట్లు- కొత్త టార్గెట్ పెట్టిన హైపర్ ఆది

0
102

జబర్డస్త్ కామెడీ షో ద్వారా బాగా పాపులర్ అయిన వ్యక్తుల్లో సుధీర్ గెటప్ శ్రీను రాంప్రసాద్ ఉంటే.. ఆ తర్వాత వారిని దాటి ముందుకు వచ్చాడు హైపర్ ఆది, అందుకే బుల్లితెరలో ఆది స్కిట్లకు అంత మంది ఫ్యాన్స్ ఉన్నారు.. ఇప్పుడు సినిమాలు కూడా చేస్తున్నాడు ఆది, అయితే ఆది పంచ్ లు కోసమే ఈ షో చూసేవారు చాలా మంది ఉన్నారు, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు ఆయన.

అదిరింది కామెడీ షోలో ఓ కమెడియన్ రేటింగ్ .. హైపర్ ఆది రేటింగ్ కంటే ఎక్కువగా ఉందనే ప్రచారాన్ని గురించిన ప్రస్తావన వచ్చింది. ఈ సమయంలో ఇవన్నీ భ్రమలు నిజాలు వేరు అని అన్నారు, ఆదితో పోలిక అలాగే బీట్ చేయాలి అంటే కొన్ని లెక్కలు ఉన్నాయి అని జబర్దస్త్ లెక్కలు చెప్పారు ఆయన.

ఫీల్డ్ లోకి వచ్చినప్పటి నుంచి జబర్దస్త్లో ఇంతవరకూ 130 స్కిట్లవరకూ చేశాను. వాటిలో 10 మిలియన్ వ్యూస్ వచ్చిన స్కిట్లు 40వరకూ వున్నాయి. 20 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చిన స్కిట్లు 5 వున్నాయి. 30 మిలియన్ వ్యూస్ పైగా వచ్చిన స్కిట్లు 2 వున్నాయి. 58 మిలియన్ వ్యూస్ వచ్చిన స్కిట్ 1 వుంది. ఇవన్నీ రికార్డులు దాటి ముందుకు వస్తే నన్ను దాటినట్టే అని ఆది తనదైన పంచ్ వేశాడు.