సిరివెన్నెల సీతారామశాస్త్రికి కన్నీటి వీడ్కోలు

0
98

ప్రముఖ సినీ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు పూర్తయ్యాయి. హైదరాబాద్​లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు బుధవారం మధ్యాహ్నం నిర్వహించారు. టాలీవుడ్​ ప్రముఖులందరూ అంతిమయాత్రకు హాజరై, సిరివెన్నెలకు కన్నీటి వీడ్కోలు పలికారు.

న్యూమోనియాతో బాధపడుతూ ఇటీవల ఆస్పత్రిలో చేరిన సిరివెన్నెల సీతారామశాస్త్రి.. చికిత్స పొందుతూ నవంబరు 30 సాయంత్రం కన్నుమూశారు. ఆయన మృతితో చిత్రపరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి.