ఆ రెండు చిత్రాల తర్వాత రాజమౌళితో మహేష్ బాబు సినిమా

ఆ రెండు చిత్రాల తర్వాత రాజమౌళితో మహేష్ బాబు సినిమా

0
96

రాజమౌళితో సినిమా చేయాలి అని చాలా మంది హీరోలు భావిస్తారు, అయితే చాలా సంవత్సరాలు దాని కోసం వెయిట్ చేస్తున్న వారు ఉన్నారు, అయితే చాలా మంది రాజమౌళి అలాగే ఓ స్టార్ హీరో కాంబినేష్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇక మీకు ఆ కాంబినేషన్ ఏమిటో అర్దం అయి ఉంటుంది …అదే మహేష్ బాబు రాజమౌళి సినిమా చాలా మంది అభిమానులు అలాగే తెలుగు సినిమా ప్రేక్షకులు కూడా దీని కోసం వెయిట్ చేస్తున్నారు.

 

అయితే తాజాగా సర్కారు వారి పాట సినిమా చేస్తున్న మహేష్ బాబు నెక్ట్స్ రాజమౌళితో సినిమా చేస్తారు అని వార్తలు వినిపిస్తున్నాయి… ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది, ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నారు రాజమౌళి ఆ తర్వాత ఆయన మహేష్ సినిమా చేస్తారు అని టాక్ టాలీవుడ్ లో నడుస్తోంది..

 

ఆరేళ్ల కింద ఈ కాంబినేషన్లో సినిమా ప్రకటించారు. కాని ఇలా వాయిదా పడుతూ వస్తోంది, అయితే ఈ ఏడాది కచ్చితంగా దీనిపై క్లారిటీ అయితే వస్తుంది అని అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే ముందు త్రివిక్రమ్ తో సినిమా ఉంటుందట మహేష్ కు.. ఈ చిత్రం తర్వాత రాజమౌళి చిత్రం తెరకెక్కిస్తారు అని టాలీవుడ్ టాక్…. అంటే సర్కారువారిపాట, అలాగే త్రివిక్రమ్ సినిమాల తర్వాత జక్కన్న సినిమా ఉంటుందట.