ఆ ద‌ర్శ‌కుడి కుమారుడి బాధ్య‌త తీసుకున్న ప్ర‌భాస్

ఆ ద‌ర్శ‌కుడి కుమారుడి బాధ్య‌త తీసుకున్న ప్ర‌భాస్

0
91

మ‌న‌కు ఎవ‌రైనా సాయం చేస్తే ఆ సాయం ఎన్న‌టికీ మ‌ర్చిపోకూడదు, ప్ర‌భాస్ ఇప్పుడు అదే చేస్తున్నారు.. అయితే సినిమా ప‌రిశ్ర‌మ‌లో ఇప్పుడు ప్ర‌భాస్ రేంజ్ ఏమిటో తెలిసిందే , పాన్ ఇండియా స్టార్, అయితే ఆయ‌న కెరియ‌ర్ లో వ‌ర్షం సినిమా ఆయ‌న‌కు ఎంతో స‌క్సెస్ ఇచ్చింది, అక్క‌డ నుంచి ప్ర‌భాస్ వెనుతిరిగి చూసుకోలేదు.

అయితే ఈ సినిమా తీసిన ద‌ర్శ‌కుడు శోభన్.. ఆ సినిమా ఎంతో పేరు తెచ్చింది ప్ర‌భాస్ కు, అయితే ఆద‌ర్శ‌కుడు ఇచ్చిన విజ‌యం ప్ర‌భాస్ ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేడు, అయితే ఆ ద‌ర్శ‌కుడు శోభ‌న్ మ‌ర‌ణించినా ఆయ‌న పై ప్రేమ‌తో ఆయ‌న కుటుంబాన్నీ ప్ర‌భాస్ చూసుకుంటున్నారు, అంతేకాదు శోభ‌న్ కుమారుడిని కూడా హీరోగా నిల‌బెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు ప్ర‌భాస్.

శోభన్ కుమారుడు సంతోష్ శోభన్, ఇప్పుడు హీరోగా గుర్తింపు కోసం తంటాలు పడుతున్నాడు.ప్రభాస్ తన సొంత బ్యానర్ యువీ క్రియేషన్స్‌లో సంతోష్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నాడు. తాను-నేను—పేపర్ బాయ్ సినిమాలు సంతోష్ చేశారు, అయినా అవి పెద్ద స‌క్సెస్ కాలేదు, కాని హీరోగా అత‌ను పేరు సంపాదించాడు, అందుకే అత‌నితో సినిమా తీస్తున్నారు,ఈ సినిమా కోసం మోడల్ కమ్ హీరోయిన్ కావ్య థపర్‌ను తీసుకున్నార‌ట‌. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది.త్వ‌ర‌లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయ‌నున్నార‌ట‌.