హీరోయిన్ అంటే అందంతో పాటు నటన అభినయం ఉంటే వెంటనే వారికి అవకాశాలు కూడా అలాగే వస్తాయి, ఇక టాలీవుడ్ లో చాలా మంది ముద్దుగుమ్మలు ఉన్నారు ఈ జాబితాలో, అయితే ఇప్పుడు టాలీవుడ్ లో నివేద పేతురాజ్ కు వరుసగా అవకాశాలు క్యూ కడుతున్నాయి, అంతేకాదు ఆమెతో దర్శకులు నిర్మాతలు సినిమా చేసేందుకు సిద్దం అంటున్నారు.
చేతినిండా వరుస అవకాశాలతో ఈ ముద్దుగుమ్మ చాలా బిజీగా ఉంది, టాలీవుడ్ లో మెంటల్ మదిలో సినిమాతో వెండితెరకు పరిచయం అయింది, ఇక తర్వాత ఆమెబ్రోచేవారెవరురా సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన అల వైకుంఠపురం సినిమాతో మరింత పేరు సంపాదించింది.
రామ్ సరసన రెడ్ సినిమాలోనూ, సాయితేజ్ పక్కన మరో సినిమాలోనూ నటిస్తోంది.. విష్వక్ సేన్ సినిమాలో కూడా ఆమె ఫైనల్ అయింది అని వార్తలు వినిపిస్తున్నాయి టాలీవుడ్ లో మరో రెండు కధలు కూడా ఆమె విన్నారట, అయితే అవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇక ఆమె చేతిలో ఐదు సినిమాలు ఉన్నట్లే,
విష్వక్ సేన్ పాగల్ చిత్రంలో ఓ కథానాయికగా నివేద ఎంపికైంది అని తెలుస్తోంది.