‘ఆ సినిమా ప్లాప్‌కు నా ఓవర్ యాక్షనే కారణం’.. ఒప్పుకున్న అమీర్ ఖాన్

-

బాలీవుడ్‌లోని టాప్ హీరోల్లో ఒకడు, ముగ్గురు ఖాన్‌లలో ఒకడైన అమీర్ ఖాన్(Aamir Khan).. తన లాస్ట్ మూవీ ‘లాల్ సింగ్ చద్దా’ ప్లాప్‌పై ఇన్నాళ్లకు పెదవి విప్పారు. సాధారణంగా ఒక సినిమా ప్లాప్ అయిందంటే దాని బాధ్యతను హీరోలు తీసుకోవడం చాలా అరుదుగా కనిపిస్తాయి. దాదాపు అన్ని వేళల్లో సినిమా ప్లాప్‌ను దర్శకుడు, హీరోయిన్ ఇలా వేరే వారిపైకి నెట్టేసే ప్రయత్నాలే జరుగుతాయి. కానీ ‘లాల్ సింగ్ చద్ధా(Laal Singh Chaddha)’ విషయంలో మాత్రం సినిమా ప్లాప్‌ను తానే కారణమని అమీర్ ఖాన్ తన స్వీయ తప్పిదాన్ని అంగీకరించాడు. దీంతో అమీర్ కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. అధ్వైత్ చందన్ తన పనిని చాలా బాగా చేశాడని మెచ్చుకున్న అమీర్.. కేవలం తన నటన బాగోకపోవడం వల్లే ‘లాల్ సింగ్ చద్ధా’ ప్లాప్ అయిందని తాజా ఇంటర్వూ ఒకదానిలో చెప్పాడు.

- Advertisement -

‘‘ఇప్పటికి కూడా పర్సనల్‌గా నాకు లాల్ సింగ్ అంటే చాలా ఇష్టం. కానీ ఆ సినిమాలో నా నటన బాగోలేదు. అందుకే ప్లాప్ అయింది. ఈ సినిమానే నేను ఓవరాక్షన్ చేసినట్లు అనిపించింది. అందుకే ప్రజలు ఈ మూవీతో కనెక్ట్ కాలేకపోయారు. ఈ సినిమా ఫెయిల్యూర్‌కు పూర్తి బాధ్యత నాదే. కానీ రాబోయే ‘సితార జమీర్ పర్’ విషయంలో ఇలాంటి తప్పులు మళ్ళీ జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. ఈ సినిమా అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నా’’ అని చెప్పాడు అమీర్(Aamir Khan). అమీర్ మాటలు విన్న అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఫెయిల్యూర్‌ను గుర్తించడం, దానిని ఒప్పుకోవడం కూడా సక్సెస్సే అంటూ కొనియాడుతున్నారు.

Read Also: మోదీని వెనక్కు నేట్టిన బాలీవుడ్ భామ.. ఎందులోనో తెలుసా..?
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | ఫార్ములా – ఈ కార్ రేసు : కేటీఆర్ కి జలకిచ్చిన ఏసీబీ

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కి ఏసీబీ జలకిచ్చింది. ఫార్ములా- ఈ...

HMPV Virus | టెన్షన్.. టెన్షన్.. భారత్ లో 3 హెచ్ఎంపీవీ కేసులు

చైనాను వణికిస్తున్న HMPV Virus భారత్ ను తాకింది. మూడు పాజిటివ్...