‘మహాభారతం’ చాలా మంది డైరెక్టర్ల డ్రీమ్ ప్రాజెక్ట్. వారిలో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజమౌళితో పాటు బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్(Aamir Khan) కూడా ఒక ఉన్నాడు. తాజా తన డ్రీన్ ప్రాజెక్ట్ అయిన ‘మహాభారతం(Mahabharat)’పై ఆమిర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ప్రాజెక్ట్ తనకు ఎన్నో బరువు బాధ్యతలతో పాటు భయాన్ని కూడా కలిగిస్తోందని అన్నాడు. ‘లాపతా లేడీస్’ ఆస్కార్ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమిర్ ఖాన్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగానే తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడాడు. ఈ సినిమాను ప్రతి భారతీయుడు గర్వపడేలా తెరకెక్కించాలనుకుంటున్నానని తెలిపాడు.
‘‘నా డ్రీమ్ ప్రాజెక్ట్ విషయంలో బాధ్యతతోపాటు భయం కూడా ఉంది. ఎలాంటి తప్పు లేకుండా భారీగా ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించాలి. భారతీయులుగా ఈ కథ మన రక్తంలో ఉంది. ఈ ప్రాజెక్ట్ నాపై ఎంతో బాధ్యతను పెంచుతుంది. అందుకే దీనిని సరైన పద్ధతిలో సక్రమంగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నా. ఈ ప్రాజెక్ట్‌తో భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చూపించాలన్నది నా ఆశ.
ఇది జరుగుతుందో? లేదో? తెలియదు. కానీ నేను మాత్రం దీని కోసం పనిచేయాలని కోరుకుంటున్నా’’ అని ఆమిర్ ఖాన్(Aamir Khan) చెప్పాడు. అయితే ‘మహాభారతం’ సినిమా దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కొచ్చని గతంలోనే వార్తొచ్చాయి. మరి ఇప్పటికి కూడా అదే బడ్జెటలో ఈ సినిమా పూర్తవుతుందా.. లేదా మరింత పెరుగుతుందా అనేది టాక్ ఆఫ్ ది టౌన్‌గా ఉంది.