Aamir Khan | కిశోర్ కుమార్ బయోపిక్‌లో అమీర్ ఖాన్?

-

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్(Aamir Khan) తన సినిమాల విషయంలో చాలా జాగ్రత్త వహిస్తున్నాడు. ‘లాల్ సింగ్ చడ్డా’ ఫ్లాప్ తర్వాత ఆచితూచి అడుగులు వేస్తూ తన తదుపరి సినిమాలను ఎన్నుకుంటున్నారు. ప్రస్తుతం ‘సితారే జమీన్ పర్’ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న అమీర్ .. తాజాగా మరో సినిమాను ఓకే చేశాడని బీటౌన్‌లో టాక్ నడుతస్తోంది. దివంగత గాయకుడు, కథానాయకుడు కిశోర్ కుమార్(Singer Kishore Kumar) బయోపిక్ తెరకెక్కించడానికి బాలీవుడ్‌లో తెగ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవల ఈ సినిమాకు అన్నీ ఫిక్స్ కాగా.. ఇందులో నటించడానికి అమీర్ ఖాన్ కూడా పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. కానీ దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.

- Advertisement -

‘‘కిశోర్ కుమార్ బయోపిక్ ప్రాజెక్ట్‌ను అనురాగ్ బసు దర్శకత్వంలో భూషన్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా వారిద్దరికీ చాలా ప్రత్యేకం కానుంది. కొన్ని రోజులుగా ఈ సినిమా గురించే అమీర్ ఖాన్ వారిద్దరితో చర్చలు చేస్తున్నాడు. ఈ సినిమాలో నటించడానికి అమీర్ ఖాన్ చాలా ఉత్సాహం ఉన్నాడు. ఎప్పుడూలేనంత ఆసక్తి చూపుతున్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌తో పాటు ఇందులో అమీర్ చేయనున్న పాత్రపై ఓ క్లారిటీ రావొచ్చు’’ అని అమీర్ ఖాన్ సన్నిహితులు అంటున్నారు. కానీ ఇప్పటి వరకు ఈ సినిమా అమీర్(Aamir Khan) పాత్ర ఏంటి అనేది మాత్రం ఏమాత్రం సమాచారం బయటకు రాకుండా మూవీ యూనిట్ జాగ్రత్తలు తీసుకుంటోంది. కానీ కొందరు కిశోర్ కుమార్ పాత్రలోనే అమీర్ కనిపించనున్నాడంటే.. కాదుకాదు సినిమాలోని వేరే కీలక పాత్రలో అమీర్ నటించనున్నాడంటూ వార్తలు తెగ వినిపిస్తున్నాయి.

Read Also: ‘ఆ సలహాలు నేనివ్వను’.. సర్జరీలపై కృతిసనన్
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | ఫార్ములా – ఈ కార్ రేసు : కేటీఆర్ కి జలకిచ్చిన ఏసీబీ

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కి ఏసీబీ జలకిచ్చింది. ఫార్ములా- ఈ...

HMPV Virus | టెన్షన్.. టెన్షన్.. భారత్ లో 3 హెచ్ఎంపీవీ కేసులు

చైనాను వణికిస్తున్న HMPV Virus భారత్ ను తాకింది. మూడు పాజిటివ్...