బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజేత అభిజిత్ ఇప్పుడు ఫుల్ బిజీ అయ్యాడు, చాలా మంది దర్శకులు అతనికి కధలు చెబుతున్నారు… అయితే వచ్చిన అన్నీంటిని ఒకే చేయకుండా మంచి స్టోరీలకి మాత్రమే ఒకే చెబుతున్నాడు, సినిమా ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు మళ్లీ అభిజిత్. అయితే పలు వెబ్ సిరీస్ లు అవకాశాలు వస్తున్నాయి.
ఇక ఈ సారి సీజన్ లో పాల్గొన్న అందరికి మంచి ఫేమ్ వచ్చింది.. పలు అవకాశాలు వస్తున్నాయి, అయితే తాజాగా ఓ వార్త టాలీవుడ్ లో వినిపిస్తోంది, అభిజిత్ కు మెగాస్టార్ సినిమాలో అవకాశం వచ్చింది అని వార్త వినిపిస్తోంది. దీంతో అతని అభిమానుల ఖుషీ ఖుషీగా ఉన్నారు.
చిరంజీవి త్వరలో మోహన్ రాజా దర్శకత్వంలో లూసీఫర్’ రీమేక్ చేయనున్నాడు. ఇక ఇందులో ఓ యంగ్ హీరో కావాలి. తండ్రి చనిపోతే సీఎం అయ్యే ఓ యంగ్ మ్యాన్ పాత్ర ఉంటుంది. ఆ పాత్రకి స్టైలిష్ గా అభి సెట్ అవుతాడు అని ఆలోచన చేశారట. మరోపక్క హీరో సత్యదేవ్ను దీని కోసం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది మరి ఈ పాత్రలో ఎవరు నటిస్తారో చూడాలి.


