తెలుగు బిగ్ బాస్ సీజన్ 4లో అభిజిత్ మంచి ఫేమ్ సంపాదించాడు.. చిత్ర సీమలో అతనికి ఇది సెకండ్ ఇన్నింగ్స్ అనే చెప్పాలి.. ఇక టైటిల్ విన్నర్ అయిన తర్వాత ఫుల్ బిజీగా ఉన్నారు వరుస ఇంటర్వ్యూలతో…ఇలా బిజీగా మారిపోయారు ఆయన.. అయితే పలు సినిమా అవకాశాలు వస్తున్నాయి… స్టోరీలు వింటున్నారు అభిజిత్.. ఇలా 105 రోజుల ఆటతో హౌస్ లో లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకున్నాడు.
ఇక హౌస్ లో ముందు మోనాల్ తో క్లోజ్ గా ఉన్నా తర్వాత ఆమెని దూరం పెట్టాడు, ఇక అభిజిత్ తర్వాత హారికకు దగ్గర అయ్యాడు. అయితే ఇద్దరూ లవ్ లో ఉన్నారు అని అందరూ అనుకున్నారు.. హారిక విషయం బయటకు వచ్చాక చెప్పాడు.. తనని చెల్లి అని చాలా సార్లు పిలిచినా ఇది బిగ్ బాస్ చూపించలేదు అని చెప్పాడు.. సో దీంతో అందరూ షాక్ అయ్యారు.
అయితే ఇక అభిజిత్ పెళ్లి విషయం గురించి వారి తల్లి లక్ష్మీ ప్రసన్న క్లారిటీ ఇచ్చారు…అభిజీత్ కి వచ్చే సంవత్సరం చివర్లో పెళ్లి చేయాలని నిర్ణయించాం. మేము చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, ఇక సంబంధాలు చూస్తున్నాం అని తెలిపారు..2021 లో కచ్చితంగా వివాహం చేస్తాము అని తెలిపారు ఆమె.