బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్యరాయ్(Aishwarya Rai), అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan) విడిపోనున్నారు. ఇప్పటికే విడాకుల కోసం దరఖాస్తులు కూడా దాఖలు చేశారు. అతి త్వరలోనే తమ విడాకుల వ్యవహారాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ విషయంలో అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్.. జోక్యం చేసుకోవడానికి ఇష్టపడటం లేదు.. కొన్ని రోజులుగా బీటౌన్‌లో హల్‌చల్ చేస్తున్న వార్తలివే.
అభిషేక్.. బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్(Nimrat Kaur)తో రిలేషన్‌లో ఉన్నాడని, అందుకే ఐశ్వర్యతో విడిపోవాలని నిశ్చయించుకున్నాడని కూడా ప్రచారం జరుగుతోంది. పలు ఫంక్షన్లకి, అంబానీ ఇంటి వివాహ వేడుకకు ఐశ్వర్య, ఆరాధ్య ఒకటిగా, బచ్చన్ ఫ్యామిలీ ఒకటిగా హారజవడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. అయితే తాజాగా తన వైవాహిక జీవితంపై అభిషేక్.. క్లారిటీ ఇచ్చాడు. అతడి సమాధానంతో వీళ్ల అభిమానులు కాస్తంత రిలీఫ్ పొందుతున్నారు.
అభిషేక్ బచ్చన్ ఇటీవల ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డులు -2024(OTT Filmfare Awards) సెర్మనీకి హాజరయ్యాడు. ఈ సందర్భంగా తన రీసెంట్ సినిమాల్లో తన పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాడు. సినిమాల్లో వరుసగా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వడం ఎలా సాధ్యమని హోస్ట్ అడిగిన ప్రశ్నకి సమాధానమిచ్చాడు. “ఇది చాలా సింపుల్. మేం చేసేదేమీ లేదు. డైరెక్టర్ మాకు ఏది చెబితే అది చేస్తాం. కామ్ గా పని చేసి ఇంటికి వచ్చేస్తాం” అని అభిషేక్(Abhishek Bachchan) చెప్పాడు.
అలాగే భార్య మాట కూడా వింటారా అని హోస్ట్ సరదాగా ప్రశ్నించగా… దీనికి అభిషేక్ కూడా సరదాగానే స్పందించాడు. “అవును, పెళ్ళైన మగవాళ్లందరూ అదే పని చేయాలి. మీ భార్య చెప్పినట్లే వినండి” అంటూ మగవాళ్ళకి అభిషేక్ బచ్చన్ సలహా ఇచ్చాడు.