హీరోయిన్ టబు తెలుగు తమిళ హిందీ చిత్ర సీమలో ఓ స్టార్ హీరోయిన్ గా ఆమె రాణించింది, ఆమె హైదరాబాద్ లో పుట్టి ముంబైలో స్దిరపడింది.. ఈమె నటి ఫరాహ్ చెల్లెలు, నటి దివ్యభారతి బెస్ట్ ఫ్రెండ్.
కూలీ నెంబర్ వన్ చిత్రంతో తెలుగుతెరపై తెరంగేట్రం చేసింది.
టబు అసలు పేరు తబుస్సుమ్ హష్మి. 1971 నవంబరు 4న హైదరాబాద్లో జన్మించింది. తండ్రి జమాల్ హష్మి, తల్లి రిజ్వానా. టబు హైదరాబాద్లోని సెంట్ ఆన్స్ హై స్కూల్లో చదువుకొంది. ప్రముఖ నటులు షబానా అజ్మీ, బాబా అజ్మీలకి టబు స్వయానా మేనకోడలు. 1980లోనే కెమెరా ముందుకెళ్లింది. బజార్ అనే చిత్రంలో బాలనటిగా ఓ చిన్న పాత్ర పోషించింది. ఆ తర్వాత ఐదేళ్లకు హమ్ నే జవాన్ లో దేవానంద్కి కూతురిగా నటించింది.
తెలుగు లో కూలీ నెంబర్ 1 చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది, ఓపక్క తెలుగు మరో పక్క హిందీ సినిమాలతో బిజీ స్టార్ గా ఎదిగింది ఆమె..టబు ఇంకా పెళ్ళి చేసుకోలేదు. ఆమె తెలుగులో చేసిన చిత్రాలు ఇవే.
1991 కూలీ నెం 1
1995 సిసింద్రీ సాంగ్
1996 ప్రేమదేశం
1996 నిన్నే పెళ్లాడుతా
1998 ఆవిడా మా ఆవిడే
2000 ప్రియురాలు పిలిచింది
2001 క్షేమంగా వెళ్ళి లాభంగా రండి
2002 చెన్నకేశవరెడ్డి
2005 అందరివాడు
2006 షాక్
2008 పాండురంగడు
2020 అల వైకుంఠపురంలొ