ఆచార్య సినిమా విడుదల ఆ రోజే ఉంటుందా – టాలీవుడ్ టాక్

ఆచార్య సినిమా విడుదల ఆ రోజే ఉంటుందా - టాలీవుడ్ టాక్

0
88

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా వస్తోంది.. ఈచిత్రం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు, అయితే ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా నటిస్తున్నారు.. ఇక చాలా వరకూ షూటింగ్ కూడా పూర్తి అయింది.

ఇక మరో 10 శాతం షూటింగ్ ఉన్నట్లు టాలీవుడ్ టాక్ నడుస్తోంది.

 

ముందుగా మే 14వ తేదీన సినిమా విడుదల చేయాలని భావించారు. షూటింగులో అంతరాయాల కారణంగా వాయిదా వేశారు. ఇక కరోనా వల్ల షూటింగ్ లు సినిమా వర్క్ ఆగిపోయింది.. దీంతో ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు… అయితే చిత్ర యూనిట్ నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.

 

టాలీవుడ్ వార్తల ప్రకారం చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22 ఆ తేదీన విడుదల చేయాలనే ఆలోచనలో ఈ సినిమా టీమ్ ఉందనే టాక్ బలంగా వినిపిస్తోంది. అయితే ఇంకా దీనికి మూడు నెలల సమయం ఉంది కాబట్టి ఈలోపు కరోనా కేసులు తగ్గుతాయి అని ఆలోచన చేస్తున్నారట. మొత్తానికి పుట్టిన రోజున విడుదల చేస్తే మంచిది అనే ఆలోచన అభిమానుల్లో కూడా ఉందట.