మెగాస్టార్ చిరంజీవి సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ చేసిన తర్వాత వరుస చిత్రాలు చేస్తున్నాడు… ఇప్పటికే ఖైదీ నంబర్ 150, సైరా వంటి చిత్రాలు చేసి అభిమానులను అలరించిన చిరు ప్రస్తుతం సూపర్ స్టార్ దర్శకుడు కొరటాల శివతో ఆచార్య చిత్రం చేస్తున్నాడు…
ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ పరిధిలో జరుగుతోంది… చిరూకు జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే… ఇది ఇలా ఉంటే ఈ చిత్రంలో రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్ర సుమారు 40 నిమిషాల పాటు నివిడి ఉంటుంది… అయితే రామ్ చరణ్ కు ఏ హీరోయిన్ జోడీగా నటిస్తుందని అందరు చర్చించుకుంటున్నారు…
ఇటీవలే రష్మిక పేరు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే… అయితే ఈ వార్తలపై క్లారిటీ రాలేదు… తాజాగా మరో హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది… రామ్ చరణ్ కు జోడీగా కియారా అద్వాని నటించనుందని వార్తలు వస్తున్నాయి… హిందీ హీరోయిన్ తో ఆ పాత్ర చేయిస్తే హిందీ మార్కెట్ కూడా కలిసి వస్తుందని సినిమా బృందం భావిస్తోందట…