ఆచార్యలో చిరంజీవికి రామ్ చరణ్ కి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా

ఆచార్యలో చిరంజీవికి రామ్ చరణ్ కి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా

0
80

మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ కొరటాల శివతో ఆచార్య సినిమా చేస్తున్నారు, ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే ప్రారంభించారు, అయితే కరోనా లాక్ డౌన్ తో ఈ చిత్ర షూటింగ్ నిలిచిపోయింది. ఇక అన్నీ సెట్ అయితే సెప్టెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభించాలి అని చూస్తున్నారు.

ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ అలాగే కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ల పై నిరంజన్ రెడ్డి, రాంచరణ్ కలిసి నిర్మిస్తున్నారు. అంటే నిర్మాతగా చరణ్ కూడా ఉన్నారు, అయితే ఈ సినిమా చిరుతో పాటు చరణ్ కూడా నటిస్తున్నారు ఓ కీలక పాత్రలో.

అయితే టాలీవుడ్ టాక్స్ ప్రకారం ఈ చిత్రంలో చరణ్ నటిస్తున్నందుకు 30 కోట్ల ఆఫర్ ఇస్తున్నారట, అయితే ఇక చరణ్ కు అంత రెమ్యునరేషన్ అంటే ఇక చిరుకి ఎంత రెమ్యునరేషన్ ఉంటుందో అని చర్చ నడుస్తోంది.ఆచార్య’ నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో వచ్చే మొత్తాన్ని చిరుకి పారితోషికంగా ఇవ్వనున్నారు అని తెలుస్తోంది. దాదాపు 50 కోట్ల వరకూ ఉంటుంది అంటున్నారు. మొత్తానికి మెగా హీరోలకి రెమ్యునరేషన్ 80 కోట్టు ఉంటుంది అని టాక్ వినిపిస్తోంది.