ఆచార్యలో రామ్ చరణ్ కు జోడీ ఎవరంటే ?

ఆచార్యలో రామ్ చరణ్ కు జోడీ ఎవరంటే ?

0
100

ఆచార్య సినిమాలో మెగాస్టార్ తో పాటు రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు అనేది తెలిసిందే, అయితే ఇంకా ఆయన షూటింగ్ కు రావడం లేదు.. ఇటు ఆర్ ఆర్ ఆర్ చిత్ర షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఇందులో నటించే అవకాశం ఉంటుంది.. బహుశా రెండు సినిమాల్లో లుక్ వేరు ఉంటుంది కాబట్టి కాస్త గ్యాప్ తీసుకోవచ్చు అంటున్నారు.

అయితే రామ్ చరణ్ కు ఇందులో జోడీ ఎవరు అనేదానిపై ఇప్పటి వరకూ అనేక వార్తలు వినిపించాయి, కియరా అద్వానీ పేరు వినిపించింది.. అలాగే తమన్నా పేరు వినిపించింది కాని ఇప్పుడు తాజాగా రష్మిక పేరు వినిపిస్తోంది.

మరి, రష్మిక ఎంపిక పూర్తయిందా? లేక కియరానే నటిస్తుందా? అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రావచ్చంటున్నారు. ఇక చిరు సరసన ఇందులో కాజల్ నటిస్తున్న సంగతి తెలిసిందే, మొత్తానికి మరో రెండు నెలల్లో చరణ్ కూడా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది అంటున్నారు యూనిట్ సభ్యులు.