ఆచార్య రిలీజ్ డేట్ అదేనంటగా….

ఆచార్య రిలీజ్ డేట్ అదేనంటగా....

0
98

టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరుస హిట్ లతో దూసుకువెళ్తున్నారు… చిరు రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఖైదీ నంబర్ 150 సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే ఆతర్వాత వచ్చి సైరా నరసింహా రెడ్డి బాక్సాఫీన్ ను షేక్ చేసింది… ఈ చిత్రానికి తనయుడు హీరో రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించాడు… ఇప్పుడు చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో చేస్తున్నారు…

ఈ చిత్రానికి ఆచార్య అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు… ఇప్పటి వరకు సుమారు 40 శాత షూటింగ్ ను పూర్తి చేసుకుంది చిత్ర యూనిట్… అయితే షూటింగ్ సమయంలో కరోనా మహమ్మారి తన కొరలను చాచడంతో షూటింగ్ నిలిచిపోయింది… ఇంకా 60 శాతం షూటింగ్ పూర్తి చేయాలి ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో షూటింగ్ ఎప్పుడు పూర్తి అవుతాదో అని అందరు చర్చించుకుంటున్నారు…

వాస్తవానికి ఈసినిమా దసరా లేదా దీపాళికి రిలీజ్ అవుతాదని అందరు అనుకున్నారు కానీ కరోనా కాటు వేసింది…. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఒక వార్త హల్ చల్ చేస్తోంది… ఏప్రిల్ 9 అంటే మనందరికి తెలిసిందే… ఆరోజు విడుదల అయిన సినిమాలు అన్ని సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.. అయితే ఆచార్య సినిమా కూడా ఆదే రోజు విడుదల అవుతుందని వార్తలు వస్తున్నాయి.. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే….