ఆచార్య రిలీజ్ అయ్యేది అప్పుడేనా – మేక‌ర్స్ ప్లాన్

Acharya movie release date -Makers Plan

0
89

చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్లో ఆచార్య సినిమా రూపొందుతోంది. ఈ చిత్రం కోసం అభిమానులు వేయిక‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు. ఇందులో ఫుల్ లెంగ్త్ పాత్ర‌లో రామ్ చ‌ర‌ణ్ కూడా న‌టిస్తున్నారు. ఇటు తండ్రి – కొడుకులు ఇద్ద‌రిని తెర‌పై ఒకేసారి చూడాలి అని చాలా మంది అభిమానులు వెయిట్ చేస్తున్నారు. అయితే ఆచార్య సినిమాకి ఈ క‌రోనా సెకండ్ వేవ్ కాస్త బ్రేక్ ఇచ్చింది.

రెండు నెల‌లుగా షూటింగ్ ఆపేశారు. దీంతో ఇప్పుడు కేసులు త‌గ్గ‌డంతో మ‌ళ్లీ షూటింగ్ ప‌ట్టాలెక్క‌నుంది. ఓ ప‌క్క ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో పాల్గొంటూ, ఇటు చ‌ర‌ణ్ ఆచార్య వ‌ర్క్ లో కూడా భాగం అవుతున్నారు. ఇక అన్నీ సినిమాలు విడుద‌ల వాయిదా వేసుకున్నాయి. దీంతో మ‌రి థియేట‌ర్లోకి ఆచార్య ఎప్పుడు వ‌స్తారు అంటే టాలీవుడ్ టాక్ ప్ర‌కారం.

జులై మొదటివారంలో షూటింగ్ షెడ్యూల్ ను మొదలుపెట్టి, 20 రోజుల్లో చిత్రీకరణను పూర్తిచేస్తారట.
దసరాకి ఈ చిత్రం విడుదల చేయాలనే ఆలోచనలో మేక‌ర్స్ ఉన్నార‌ట‌. అయితే ఈసారి ద‌స‌రా బ‌రిలో చాలా సినిమాలు ఉండే అవ‌కాశం ఉంది. దీనిపై ముందే ప్ర‌క‌ట‌న రావ‌చ్చు అంటున్నారు టాలీవుడ్ పెద్ద‌లు.