మెగాస్టార్ చిరంజీవి ఏది చేసినా స్టైల్ గానే ఉంటుంది, ఇక నిన్న హామీ ఇచ్చారు అభిమానులకి ఆచార్య సినిమా గురించి అప్ డేట్ వస్తుంది అని, కొరటాల శివ, చిరంజీవి హీరోగా రూపుదిద్దుకుంటున్న ఆచార్య అప్ డేట్ వచ్చేసింది, తాజాగా అద్బుతమైన వీడియోని వదిలారు మెగా అభిమానులు చాలా ఆనందంలో ఉన్నారు.
ఈ చిత్రం టీజర్ ను 29వ తేదీన సాయంత్రం 4.05కు విడుదల చేస్తున్నట్టు తెలిపారు. ఇక సినిమాలో హైలెట్ ఏమిటి అంటే ధర్మస్థలి.. సో దానిని పాయింట్ గా చేసి ధర్మస్థలి డోర్లు జనవరి 29, సాయంత్రం 4.05 గంటలకు తెరచుకోబడతాయి అని టీజర్ ప్రకటన వీడియోని రిలీజ్ చేశారు.. ఇక కొరటాల నుంచి ఈ పోస్టు రాగానే పెను వైరల్ అయింది ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తోంది.
ఇక కరోనా లాక్ డౌన్ వల్ల దాదాపు 9 నెలలు చిత్ర షూటింగ్ ఆగిపోయింది.. ఇక మిగిలిన ప్రాజెక్టులు ఆలస్యం అయ్యాయి.. తాజాగా ఆయన మళ్లీ షూటింగులో ఉన్నారు, ఇక సమ్మర్ లో ఈ సినిమా విడుదల జరగనుంది.ప్రతీ ఒక్కరిని అబ్బురపరిచేలా టీజర్ ఉంటుంది అని తెలిపారు.
వీడియో..