ఆచార్య ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు..

0
118

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న భారీ చిత్రం ఆచార్య. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్, రామ్ ​చరణ్ జతగా పూజాహెగ్డే నటిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్ నక్సలైట్లుగా కనబడనున్నారు. దాయ శాఖలో జరిగే అక్రమాల నేపథ్యంలో ఈ సినిమా కథ తెరకెక్కింది.

కరోనా వైరస్ థార్డ్‌ వేవ్‌ కారణంగా ఈ సినిమా వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా చిత్ర బృందం అదిరిపోయే అప్ డేట్ వదిలింది. ఈనెల 12వ తేదీన ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించింది. అందుకు సంబదించిన పోస్టర్ ను అధికారికంగా ప్రకటించారు. రామ్ చరణ్, పూజ హెగ్డే లపై వేసిన పోస్టర్ తెలుగు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా ఈ వేసవి కానుకగా ఈ సినిమాను ఏప్రిల్ 29న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.