ఆచార్య’ ఓటీటీ డేట్ ఖరారు..ఎప్పుడంటే?

0
98

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా నటించిన భారీ చిత్రం ఆచార్య. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ లాహే లాహే పాటలో నటించిన తరువాత ఈ సినిమా నుంచి తీసివేయడం జరిగింది. రామ్ ​చరణ్ జతగా పూజాహెగ్డే నటించారు. భారీ అంచనాలతో ఈ సినిమా ఏప్రిల్ 29 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయి ప్రేక్షకులను సంతోషపెట్టింది.

కానీ అనుకున్న మేరకు కల్లెక్షన్స్ సాదించలేకపోవడంతో చిత్రబృందం నిరాశ పర్చిన విషయం తెలిసిందే. గత నెలలో రిలీజ్ అయిన ఈసినిమా ఎలాగూ ప్లాప్ అయ్యింది కనుక కనీసం ఓటీటీ లో అయినా త్వరగా విడుదల చేస్తే అభిమానులకు కాస్త ఊరట కలుగుతుందని ఓటీటీలో రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు చిత్రబృందం.

ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆచార్యను మూడు వారాల కంటే ముందే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. మే 20 వ తేదీన ఆచార్య సినిమాను అమెజాన్‌ ప్రైమ్‌ లో విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించేసింది చిత్ర బృందం. ఇక మే 20 రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా కూడా ఓటీటీలోకి సందడి చేయబోతుంది.