టాలీవుడ్ సీనియర్ హీరో అబ్బాస్(Actor Abbas) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. నైంటీస్ యువకులకు అప్పట్లో ఈయనే ఫేవరేట్ హీరో. ఆయన వేసిన బట్టలు, హెయిర్ స్టైల్‌ను అనేకమంది యువకులు ఫాలో అయ్యేవారు. ముఖ్యంగా ప్రేమదేశం సినిమాలో అబ్బాస్ యాక్టింగ్‌కు సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. ఆ సినిమాలోని సీన్లు, పాటలు ఇప్పటికీ యూట్యూబుల్లో మార్మోగుతూనే ఉంటాయి. ప్రస్తుతం ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు.
తాజాగా.. ఆయన(Actor Abbas) ఓ మీడియా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కెరీర్‌పై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తనకు చాలా సిగ్గు ఉంటుందని, అందుకే ఎక్కువగా జనాలు రద్దీ ఉండే ప్రాంతాల్లో తిరగను అని చెప్పారు. ఇదే కారణంగా సోషల్ మీడియాకూ దూరంగా ఉంటున్నానని అన్నారు. 19 ఏళ్ల వయసులోనే అనుకోకుండా సినిమాల్లోకి వచ్చానని చెప్పారు. డబ్బు సంపాదించేందుకు సినిమా పరిశ్రమను ఒక మార్గంగా ఎంపిక చేసుకున్నాను అని కీలక విషయాలు చెప్పుకొచ్చారు.