Daniel Balaji | ప్రముఖ నటుడు డేనియల్ బాలాజీ హఠాన్మరణం..

-

కోలీవుడ్ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు డేనియల్ బాలాజీ(48) కన్నుమూశారు. శుక్రవారం అర్థరాత్రి చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. మరోవైపు చనిపోయి కూడా డేనియల్(Daniel Balaji) మంచి మనసు చాటుకున్నారు. తన రెండు కళ్లను దానం చేశారు.

- Advertisement -

కాగా ప్రొడక్షన్ మేనేజర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన పలు సీరియల్స్‌లో నటించాడు. దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ‘కాక్క కాక్క’, ‘వెట్టైయాడు వెలైయాడు’చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక తెలుగులోనూ సాంబ, ఘర్షణ, చిరుత, సాహసం శ్వాసగా సాగిపో, టక్ జగదీశ్’ చిత్రాల్లో Daniel Balaji నటించాడు. తమిళ్, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో 50కి పైగా చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకులను అలరించాడు.

Read Also: కాంగ్రెస్ పార్టీలో చేరిన గ్రేటర్ హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

చంద్రబాబు నాకు గురువు కాదు.. సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్..

టీడీపీ అధినేత చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)ది గురుశిష్యుల...

తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలపై ఈసీ ఆంక్షలు

తెలంగాణలో రైతు భరోసా(Rythu Bharosa) నిధుల పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘం...