తమిళ నటుడు, డీఎండీకే చీఫ్ విజయ్ కాంత్(Vijayakanth) కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా చెన్నైలోని మియోట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. శ్వాస సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతుండటంతో కుటుంబసభ్యులు ఆయన్ని ఆసుపత్రిలో చేర్పించారు. లంగ్స్ లో ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. దీంతో వైద్యులు ఆయన్ని వెంటిలేటర్ పై ఉంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. అయినప్పటికీ ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
71 ఏళ్ల విజయకాంత్ దాదాపు ఏడాది కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయనకి న్యుమోనియా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అయితే ఆయన ఆరోగ్యం క్షీణించడంతో నవంబర్ 18న ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. చికిత్స అనంతరం ఆరోగ్య పరిస్థితి బెటర్ అవడంతో డిసెంబర్ 11 న డిశ్చార్జ్ అయ్యారు. మరోసారి శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడంతో రెండు రోజుల క్రితం కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో విజయకాంత్(Vijayakanth) కన్నుమూశారు. ఆయన మరణ వార్త కుటుంబసభ్యులను, అభిమానులను తీవ్రంగా కలచివేసింది.