న‌టుడు కృష్ణుడు టాలీవుడ్ లో ధ‌న‌వంతుల కుటుంబం – ఆయ‌న గురించి మీకు తెలియ‌ని విష‌యాలు

న‌టుడు కృష్ణుడు టాలీవుడ్ లో ధ‌న‌వంతుల కుటుంబం - ఆయ‌న గురించి మీకు తెలియ‌ని విష‌యాలు

0
131

టాలీవుడ్ లో కృష్ణుడు మ‌న అంద‌రికి తెలిసిన న‌టుడు, డిఫ‌రెంట్ జోన‌ర్ సినిమాలు చేశారు ఆయ‌న‌, గోదావ‌రి జిల్లాల నుంచి వ‌చ్చిన ఓ జ‌మీందారీ కుటుంబానికి చెందిన వార‌సుడు..కృష్ణుడు ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. అయితే ఆయ‌న గురించి కొన్ని విష‌యాలు తెలుసుకుందాం.

కృష్ణుడు తూర్పుగోదావరి జిల్లా రాజోలు తాలూకాకు చెందిన జమీందారీ కుటుంబంలో జన్మించారు. పాల‌కొల్ల ప‌ట్ట‌ణానికి ద‌గ్గ‌ర‌లో ఉండే చించినాడలో పేరుమోసిన జమీందార్ అల్లూరి వరాహ వెంకట సూర్యనారాయణ రాజు కృష్ణుడుకి ముత్తాత.

ఆయ‌న ముత్తాత సూర్యనారాయణ రాజు, కాటన్ దొర చాలా మంచి స్నేహితులు, ఈ విష‌యం చాలా మందికి తెలియ‌దు.. ఎంతో పేరున్న రాజోలులో కెనాల్ సిస్టమ్‌ను తీసుకొచ్చింది ఆయ‌న ముత్తాత సూర్యనారాయణ రాజు, అందుకే వారిని ఇప్ప‌టీకీ జ‌మీందారులు అంటారు.

అయితే సుమారు వారికి తాత‌గారు ఉన్న స‌మ‌యంలో 5 వేల ఎక‌రాల ఆస్తి ఉంది, కాని 1976లో ఇందిరా గాంధీ ప్రవేశపెట్టిన ల్యాండ్ సీలింగ్ యాక్ట్‌ వల్ల ఈ కుటుంబం 3,500 ఎకరాల భూమిని కోల్పోయింది. దాదాపు 50 ఏళ్ల క్రితం వారి ద‌గ్గ‌ర ఇంటి ముందు ఖ‌రీదైన కార్లు ఉండేవి బెంజ్, ఆస్టిన్ వంటి లగ్జరీ కార్లను వారి కుటుంబం వాడింది, ఇప్ప‌టీకీ రాజోలులో వారికి పాత బంగ్లా ఉంది, పూర్వ‌పు ఆస్తులు ఉన్నాయి.

కృష్ణుడు పెదనాన్న ఏవీ సూర్యనారాయణ రాజు రాజోలు నియోజకవర్గానికి 25 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. త‌ర్వాత సినిమాల‌పై ఇంట్ర‌స్ట్ తో చ‌దువు పూర్తి అయ్యాక కృష్ణుడు హైద‌రాబాద్ వ‌చ్చి సినిమాల్లో న‌టిస్తున్నారు.