Manchu Vishnu | లోకేష్‌ను కలిసిన మంచు విష్ణు..

-

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌(Nara Lokesh)ను సినీ నటుడు మంచు విష్ణు(Manchu Vishnu) శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. వారిద్దరూ పలు అంశాలపై చర్చించుకున్నారు. ఈ విషయాన్ని విష్ణు తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. లోకేష్ పాజిటివ్ ఎనర్జీని చూసి ఆశ్చర్యపోయానంటూ విష్ణు కొనియాడారు. ‘‘మై బ్రదర్.. ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్‌ను ఈరోజు కలిశాను. అతనితో అనేక అంశాలపై చర్చించాను. ఈ చర్చలు చాలా ఫలదాయకంగా ముందుకు సాగాయి. ఆయన పాజిటివ్‌ ఎనర్జీ నిజంగా అద్భుతం. మీరు మరెన్నో విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నా’’ అని మంచు విష్ణు పోస్ట్ పెట్టాడు.

- Advertisement -

ఇదిలా ఉంటే మంచు విష్ణు ప్రస్తుతం ‘కన్నప్ప(Kannappa)’ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని సమాచారం. తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు విష్ణు(Manchu Vishnu). ఈ సినిమాకు మహాభారత్ సీరియల్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. దూర్జటి రాసిన శ్రీకాళహస్తీస్వర మహత్యంలోని కన్నప్ప చరిత్రను స్ఫూర్తిగా తీసుకుని సినిమాగా రూపొందిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 25న విడుదల కానుంది.

Read Also: ‘కొండా సురేఖ.. మంత్రి పదవికి అనర్హురాలు’
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Mohan Babu | మోహన్ బాబుకి సుప్రీం కోర్టులో భారీ ఉపశమనం

ప్రముఖ నటుడు మోహన్‌బాబు(Mohan Babu)కి సుప్రీం కోర్టులో భారీ ఉపశమనం లభించింది....

Tirupati తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి

తిరుపతి(Tirupati) తోకేసులాట ఘటనలో మృతుల సంఖ్య 6కి చేరింది. మరో 48...