‘రేసుగుర్రం’ తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తనదైన నటనతో ప్రేక్షకులకు దగ్గరైన నటుడు రవికిషన్(Ravi Kishan). తన విలక్షణ నటనతో తాను చేసిన ప్రతి విలన్ పాత్ర కూడా తెలుగు ఇండస్ట్రీ ఇక డిఫరెంట్ మార్క్‌ను చూపాయి. ‘రేసుగుర్రం’ సినిమాలో మద్దాలి శివారెడ్డిగా రవికిషన్ అదరగొట్టాడు. నిజానికి రవికిషన్.. బోజ్‌పురీకి చెందిన నటుడు. అక్కడ అతడికి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. తాజాగా తన హోమ్ ఇండస్ట్రీ అదేనండి భోజ్‌పురీ సినీ ఇండస్ట్రీని(Bhojpuri Film Industry) ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో నిర్వహించిన ఓ సాహిత్య కార్యక్రమంలో పాల్గొన్న రవికిషన్.. ఇండస్ట్రీలో తన జూనియర్లను ఉద్దేశించిన ఘాటుగా స్పందించారు. భోజ్‌పురీ ఇండస్ట్రీ ఇదివరకటిలా లేదని, ఇప్పుడు అంతా చెడిపోయిందని చెప్పుకొచ్చాడు.
ఇండస్ట్రీలో తన జూనియర్లు ఇండస్ట్రీ పరువు తీస్తున్నారని వ్యాఖ్యనించారు. ‘‘ఇప్పుడు వస్తున్న చాలా మంది నటీనటులు భోజ్‌పురి సినీ పరిశ్రమ పరువు తీస్తున్నారు. భోజ్‌పురి ఇండస్ట్రీ మూడో జనరేషన్‌లో నేను ఎంట్రీ ఇచ్చాను. నా తర్వాత వచ్చేవాళ్ల కోసం అన్నీ ఏర్పాటు చేశాం. కానీ వాళ్లు ఆ అవకాశాలను, సదుపాయాలను సరిగా వినియోగించుకోవడం లేదు. ఒక్కముక్కలో చెప్పాలంటే ఇండస్ట్రీ పరువు తీస్తున్నారు. భోజ్‌పురి మాట్లాడే ప్రజలు 25 కోట్ల మంది ఉన్నారు. ఇందుకు నేను చాలా గర్విస్తున్నాను. ఈ ఇండస్ట్రీ చాలా మందికి ఉపాధి కల్పిస్తుంది. అయినా సరే.. ఈ ఇండస్ట్రీని చిన్న చూపు చూస్తున్నారు. ప్రస్తుతం భోజ్‌పురి ఇండస్ట్రీని నమ్ముకుని లక్ష మంది జీవిస్తున్నారు’’ అని రవికిషన్(Ravi Kishan) చెప్పుకొచ్చాడు.