బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan)కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఏప్రిల్ 30వ తేదీలోపు చంపేస్తామంటూ ఫోన్‌లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు. ఏప్రిల్ 10వ తేదీన సల్మాన్‌కు ఫోన్ రాగా, ఫోన్ చేసిన వ్యక్తి రాఖీభాయ్(Rakhi Bhai)గా పరిచయం చేసుకున్నట్లు సమాచారం. రాజస్థాన్(Rajasthan) నుంచి కాల్ చేస్తున్నట్లు మరో ఫోన్‌లో చెప్పడం విశేషం. అనంతరం వాళ్లకీ వీళ్లకీ కాకుండా ఏకంగా ముంబై(Mumbai) పోలీస్ కంట్రోల్ రూంకి కాల్ చేసి మరీ.. సల్మాన్ ఖాన్‌ను చంపేస్తాం.. చంపి తీరతాం అని చెప్పటం సంచలనంగా మారింది. కాగా, పోలీస్ కంట్రోల్ సెంటర్‌కు వచ్చిన కాల్‌పై ముంబై పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఇందులో నిజం ఉందా లేదా.. ఏదైనా ప్రాంక్ కాల్ వచ్చిందా? అనే రీతిలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు రాజస్థాన్ పోలీసులను సైతం అలర్ట్ చేశారు ముంబై పోలీసులు. కొన్నాళ్ల క్రితం సల్మాన్ ఖాన్(Salman Khan) కు ఈ–మెయిల్ ద్వారా వార్నింగ్ వచ్చింది. ఆ క్రమంలోనే కొత్త బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కొనుగోలు చేశాడు బాలీవుడ్ హీరో. దీనికితోడు సెక్యూరిటీ పెంచారు ముంబై పోలీసులు. ఎక్కడికి వెళ్లేదే.. ఏ రోజు ఏ షూటింగ్ లో పాల్గొనేది అనేది ముందుగానే పోలీసులకు సమాచారం ఇచ్చి వెళుతున్నారు సల్లూభాయ్. ఈ క్రమంలో బెదిరింపు కాల్ రావడం ఆసక్తికరంగా మారింది.
Read Also: పవర్ స్టార్ ఫ్యాన్స్ కు క్రేజీ అప్టేడ్.. త్వరలో వకీల్ సాబ్2!
Follow us on: Google News, Koo, Twitter