Actor Samuthirakani Saplings as part of Green India Challenge in Hyderabad: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన నటుడు సముద్ర ఖని. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ఇప్పటివరకు అనేకమంది రాజకీయ నాయకులు, సెలెబ్రేటిస్ పాల్గొన్నారు. ఛాలెంజ్ లో భాగంగా డైరెక్టర్ ఎం. శశికుమార్ విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించిన సముద్ర ఖని హైదరాబాద్ లోని హైటెక్ సిటీ శిల్పారామం లో రావి మొక్కను నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ… ఇంత గొప్ప కార్యక్రమంలో భాగస్వామి అయినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమం కొనసాగింపుగా తన కుమారుడు హరివిఘ్నేశ్వరన్, కూతురు శివానీ, ప్రముఖ దర్శకులు హెచ్.వినోత్‌లకు సముద్ర ఖని ఛాలెంజ్ ను విసిరారు.