ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్(Sharwanand) కలిశారు. ఇటీవల వివాహం చేసుకున్న శర్వా.. గురువారం ప్రగతి భవన్‌లో సీఎంను కలిసి తన రిసెప్షన్ వేడుకకు రావాలని కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆప్యాయంగా శర్వానంద్‌ను పలకరించి శుభాకాంక్షలు తెలియజేశారు. హైదరాబాద్‌లోని కన్వెన్షన్ ఫెసిలిటీలో శుక్రవారం శర్వానంద్(Sharwanand) రిసెప్షన్ జరగనుంది. ఇటీవల జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో పెళ్లి జరిగింది. ఈ వివాహవేడుకకు అత్యంత సన్నిహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు అయ్యారు. రామ్ చరణ్, సిద్దార్థ్, అదితిరావు హైదరి, నిర్మాత వంశీ, అనురాగ్ వంటి ప్రముఖులు వివాహానికి హాజరయ్యారు. రక్షితారెడ్డి మాజీ మంత్రి, టీడీపీ దివంగత నేత బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి మనవరాలు కావడం గమనార్హం.
రిసెప్షన్‌కు సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించిన హీరో శర్వానంద్
-