టాలీవుడ్ లో శ్రీహరికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆయన ఎన్నో అద్భుత చిత్రాలు చేశారు. హీరోగా విలన్ గా అనేక వైవిధ్యభరితమైన రోల్స్ చేశారు. ఇక ఆయన మరణంతో చిత్ర సీమ విషాదంలోకి వెళ్లింది. ఆయన తర్వాత ఆయన కుటుంబం నుంచి ఆయన కుమారుడు మేఘాంశ్ సినిమా పరిశ్రమలోకి వచ్చారు. ఆయన హీరోగా కొత్త ప్రాజెక్టు మొదలవుతోంది.
శ్రీహరి పుట్టినరోజు సందర్భంగా నిన్న ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ వచ్చింది. ఇక ఆయన అభిమానులు ఈ ప్రకటన విని చాలా ఆనందించారు. ఇది ఆయనకు మూడో చిత్రం ఈ సినిమాకి రాసిపెట్టుంటే అనే టైటిల్ ను ఖరారు చేశారు. సి.కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాకి నందు మల్లెల దర్శకుడిగా చేస్తున్నారు.
యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ సినిమా, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక ఆయన తొలి చిత్రం చూస్తే రాజ్ దూత్ అనే సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. ఇక సినిమా పెద్దగా ఆడలేదు కాని అతని నటనకు మంచి పేరు వచ్చింది. ఇక తర్వాత సినిమా సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో కోతి కొమ్మచ్చి ఇది షూటింగ్ జరుగుతోంది. ఇప్పుడు మూడో సినిమా చేస్తున్నారు.