అభిమాని మృతిని తట్టుకోలేక ఏడ్చేసిన స్టార్ హీరో

-

తమిళ స్టార్ హీరో సూర్య(Actor Surya)కు తెలుగులోనూ మాంచి ఫాలోయింగ్ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన నటించిన యముడు, సింగం, జైభీమ్, గజిని వంటి సినిమాలు అనేకం తెలుగులోనూ సత్తా చాటాయి. అయితే, ఇటీవల జరిగిన ఓ ఇన్సిడెంట్‌కు హీరో సూర్య కన్నీళ్లు పెట్టుకున్నాడు. యూఏస్ టెక్సాస్‌లో జరిగిన కాల్పుల్లో తెలుగమ్మాయి తాటికొండ ఐశ్వర్య(Aishwarya) మరణించిన విషయం తెలిసిందే. ఆమె తమిళ స్టార్ హీరో సూర్యకు చాలా పెద్ద అభిమాని. ఈ విషయం తెసులుకున్న సూర్య.. ఆమె మరణం పట్ల తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఐశ్వర్య చిత్ర పటానికి నివాళులు అర్పించి.. ఆమె కుటుంబసభ్యులకు సానుభూతిని తెలియజేస్తూ లేఖ కూడా రాసాడు. ఈ లేఖలో సూర్య(Actor Surya).. “ఐశ్వర్య మృతి తీరని లోటు. మిమ్మల్ని ఎలా ఓదార్చాలో కూడా నాకు తెలియడం లేదు. మన జ్ఞాపకాల్లో ఎప్పుడూ సజీవంగానే ఉంటింది” అంటూ ఆమె తల్లిదండ్రులను ఓదార్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...