టాలీవుడ్ యంగ్ హీరోయిన్ డింపుల్ హయాతీ(Dimple Hayathi) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. వినూత్న కథనాలు ఎంపిక చేసుకొని ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నది. ఇటీవల గోపీచంద్ హీరోగా నటించిన రామబాణి సినిమాలో నటించింది. ఫైనాన్షియల్‌గా ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా.. డింపుల్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇదిలా ఉండగా.. ఇటీవల డింపుల్ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. పలు వివాదాస్పద ట్వీట్లు చేస్తోంది.
తాజాగా.. హైదరాబాద్ ట్రాఫిక్‌పై ఓ ఆసక్తికర ట్వీట్ పెట్టింది. అది కాస్త వివాదాస్పదం కావడంతో వెంటనే డిలీట్ చేసింది. ఇటీవల కేబుల్ బ్రిడ్జిపై ట్రాఫిక్‌లో చిక్కుకున్న వాహనాలు ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేసిన ఆమె ‘వేర్ ఇస్ ట్రాఫిక్ డీసీపీ. ఇంటికి చేరుకోవాలంటే గంటకు పైగా సమయం పడుతోంది. రోడ్లపై ఇంత ట్రాఫిక్ జామ్ అవుతుంటే ట్రాఫిక్ డీసీపీ ఎటు పోయారు? ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే పరిస్థితి ఏంటి? మాకు పెట్రోల్ ఏమైనా ఫ్రీగా వస్తుందా ?’ అంటూ పోస్ట్ పెట్టింది. మంత్రి కేటీఆర్, తెలంగాణ సీఎంవోలను కూడా ట్యాగ్ చేసింది. దీంతో ఒక్కసారిగా ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. చివరకు అనూహ్యంగా ఆమె(Dimple Hayathi) ట్వీట్ డిలీట్ చేసింది.