ఆ సినిమాలో హేమ శ్రీదేవికి డూప్ గా నటించారట – ఆ చిత్రం ఏమిటంటే

Actress Hema will be seen as a Sridevi dope in the film

0
134

సినీ ఇండస్ట్రీలో హీరోలకు, హీరోయిన్లకు పలు సీన్స్ లో డూప్లు నటిస్తారు అనేది తెలిసింది . నాటి సినిమాల నుంచి నేటి సినిమాల వరకూ ఇది జరుగుతుంది. స్టంట్లు, రిస్కీ షాట్లు కొన్ని కొన్ని ఫైట్ల సమయాల్లో డూబ్ లు నటిస్తారు. అయితే సెంటిమెంట్ సీన్లలో ఒకేసారి ఇద్దరు కనిపించాలి అనే సమయంలో, కొందరు నటులు కూడా వారిలా డూప్ గా కనిపిస్తారు. అప్పట్లో ఎన్టీఆర్ సినిమాల్లో డూప్ గా చేయాలి అంటే కైకాల సత్యనారాయణ చేసేవారు అనేది తెలిసిందే.

అయితే తాజాగా ఓ వార్త వినిపించింది. అతిలోక సుందరి శ్రీదేవికి డూప్ గా హేమా నటించారు అనే విషయం మీకు తెలుసా. ఏ సినిమా అనుకుంటున్నారా. కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి, శ్రీదేవి హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం జగదేకవీరుడు అతిలోక సుందరి. ఈ సినిమాలో ఓ సీన్లో భాగంగా శ్రీదేవి స్విమ్మింగ్ ఫూల్లో ఈత కొట్టే సీన్ ఉంటుంది. అయితే ఆమెకి ఈత రాదు. ఈ సమయంలో ఈ సీన్ కోసం ఎవరు ఉన్నారా అని చూశారట.

అప్పుడు యూనిట్ లో ఎవరో నటి హేమ పేరు చెప్పారు, సరిగ్గా అదే సమయంలో ఊటీలో మరో షూటింగ్లో ఆమె ఉన్నారు. దీంతో సదరు సినిమా వాళ్ల పర్మిషన్ తీసుకొని హేమతో ఆ సీన్ చేయించారట.